: కాసేపట్లో గుంటూరులో ఏపీఎన్జీవోల భేటీ
మరి కాసేపట్లో ఏపీఎన్జీవో సంఘాలు గుంటూరులో భేటీ కానున్నాయి. దీంతో సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెకు సంబంధించి భవిష్యత్తు ప్రణాళికకు ఓ రూపం రానుంది. ఉద్యమంలో ఉద్యోగుల పాత్రతో పాటు, ఉద్యమానికి ఓ రూపం తీసుకువచ్చి విభజనపై పోరును తీవ్రతరం చేయనున్నారు. భవిష్యత్తులో ఎలాంటి నిరసనలు చేపట్టాలన్న దానిపైనా, ఉద్యోగులు పాలుపంచుకోవాల్సిన బాధ్యతలు వంటి వాటిపైనా పూర్తి స్పష్టత ఈ భేటీతో రానుంది. ప్రధానంగా సీమాంధ్ర రాజకీయ నాయకుల తీరుతెన్నులపై అక్కడి ప్రజల్లోనూ, ఉద్యోగుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. దాంతో వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలన్న దానిపై కార్యాచరణ ప్రణాళిక రచించనున్నారు. విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాల ఉద్యమ స్ఫూర్తికి పూర్తి మద్దతు ప్రకటించాయి.