: గానామృతుడు మొహమ్మద్ రఫీనే!
హిందీ చిత్ర సీమలో బంగారు స్వరధారుడు మొహమ్మద్ రఫీనే అని సీఎన్ఎన్ఐబీఎన్ నిర్వహించిన పోల్ లో స్పష్టమైంది. రఫీ, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్, ఆశాభోస్లే పేర్లను సర్వేయర్ల ముందు పెట్టగా.. రఫీ, కిషోర్ కుమార్ పేర్ల మధ్య తీవ్ర పోటీ నడిచింది. చివరికి అత్యధికంగా 35 శాతం మంది మొహమ్మద్ రఫీనే గానామృతుడుగా ఓటేశారు. కిషోర్ కుమార్ కు 33 శాతం వరకూ ఓటేశారు. లతా మంగేష్కర్ 25 శాతం ఓట్లను పొందారు. మొహమ్మద్ రఫీ సుమారు 5,000 పాటలు పాడి భారతావనికి కమ్మని స్వరం మిగిల్చి వెళ్లిన సంగతి తెలిసిందే.