: సింధురక్షక్ లో మరో మృతదేహం లభ్యం
పేలుళ్ళతో నీట మునిగిన ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామి నుంచి డైవర్లు మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో మొత్తం మూడు మృతదేహాలు బయటపడ్డట్లయింది. ఇంకా 15 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఎవరూ బతికి ఉండే అవకాశం లేదని నేవీ ప్రకటించింది.