: సీమాంధ్రలో కొనసాగుతున్న నిరసనల ఉధృతి
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాలలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగుల నిరవధిక సమ్మె విజయవంతంగా సాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. తిరుమలకు మాత్రం పరిమిత సర్వీసులు నడుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కేబుల్ టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. వీటిని నిలిపివేస్తున్నట్లు ఎంఎస్ఓల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయనగరంలో కాంగ్రెస్ కార్యకర్తల రిలే దీక్ష 21వ రోజూ కొనసాగుతోంది. చీపురుపల్లి, సుభద్రాపురం రహదారిపై మెట్టపల్లి వద్ద వంటావార్పుతో స్థానికులు నిరసనలో పాల్గొన్నారు. కడపలో సమైక్యాంధ్రకు మద్దతుగా టీవీఎస్ సంస్థ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సచివాలయ ఉద్యోగులు ఈ రోజు సామూహిక సెలవు తీసుకోనున్నారు.