: పుచ్చకాయ రసంతో నొప్పి మాయం


పుచ్చకాయ రసంలో పలు ఔషధ గుణాలున్నాయి. పుచ్చకాయను సహజంగా వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారు కూడా పుచ్చకాయ రసాన్ని బాగా వాడుతారు. అయితే వ్యాయామం చేయడం ద్వారా అప్పుడప్పుడు కండరాలు నొప్పి పెడతాయి. ఇలాంటి నొప్పులను నివారించేందుకు పుచ్చకాయ రసం చక్కగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

వ్యాయామం చేసే వారికి కండరాలు నొప్పి పెట్టడం సహజం. అయితే ఇలా కండరాల నొప్పి ఉన్నవారు పుచ్చకాయ రసం తాగితే కండరాల నొప్పి మాయమవుతుందంటున్నారు అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ (ఏసీఎస్‌) పరిశోధకులు. కఠినమైన వ్యాయామం చేసిన తర్వాత కండరాల్లో బాధ కలిగితే, ఆ బాధనుండి ఉపశమనంకోసం పుచ్చకాయ రసం తీసుకోమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రసంలో ఉండే అమైనో ఆమ్లం, 'ఎల్‌`సిట్రలిన్‌' కండరాల నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుందట. అలాగే ఈ రసంలో ఉండే యాంటీ`ఆక్సిడెంటు గుణాలు కండరాల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లను పుష్కలంగా కలిగివున్నాయని, క్రీడాకారులు మరింతగా ప్రతిభ చూపేందుకు పుచ్చకాయ రసం చక్కగా దోహదపడుతుందని గతంలో ఒక అధ్యయనంలో వెల్లడైనట్టు ఎసీఎస్‌ పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News