: బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన బాగ్దాద్
ఇరాక్ రాజధాని బాగ్దాద్ కారు బాంబు పేలుళ్ళతో దద్దరిల్లింది. నగరంలో జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే నాలుగు ప్రాంతాల్లో తీవ్రవాదులు ఈ పేలుళ్ళకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 21 మంది మరణించారు. మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారని ఇరాక్ మీడియా తెలిపింది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.