: మమ్మల్నెందుకు వేరుగా చూస్తున్నారు?: కాశ్మీర్ సీఎం


తమను ప్రధాన స్రవంతిలో కలవనీయకుండా, వేరుగా చూస్తున్నారని జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. కాశ్మీరీలను దేశ ప్రజల్లా పరిగణించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనగర్లోని బక్షీ స్టేడియంలో ఈ ఉదయం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. భారతదేశ ప్రధాన స్రవంతిలో తాము భాగం కాదన్నట్టే వ్యవహారం నడుస్తోందని పరోక్షంగా కేంద్రంపై ధ్వజమెత్తారు. ఇటీవలే కాశ్మీర్లోని కిష్త్వాడ్ లో జరిగిన మతహింస పట్ల ఒమర్ అబ్దుల్లా వ్యవహరించి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంటులోనూ ఈ విషయమై రగడ చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ఒమర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మత ఘర్షణలు ఎక్కడ జరగడంలేదని ప్రశ్నించారు. యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోనూ ఈ తరహా అల్లర్లు జరిగాయన్నారు.

  • Loading...

More Telugu News