: నేను ఉగ్రవాదినని చేతనైతే నిరూపించండి: హఫీజ్ సయీద్


జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తాను ఉగ్రవాదిని కాదని స్పష్టం చేశాడు. అవసరమైతే భారత్, పాకిస్థాన్ కు చెందిన న్యాయమూర్తులతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరాడు. ఒకవేళ ఆ కమిటీ తాను ఉగ్రవాదినేనని తేలిస్తే అప్పుడు అంగీకరిస్తానని ప్రకటించాడు. లాహోర్ లో నిన్న జరిగిన పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో హఫీజ్ పాల్గొని మాట్లాడాడు.

హఫీజ్ ను తమకు అప్పగించాలంటూ భారత్.. పాక్ ను డిమాండ్ చేయడాన్ని తోసిపుచ్చాడు. 'నా కోసం అంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారా.. కంగారు పడకండి. నేనే భారత్ కు వస్తా' అని హఫీజ్ వ్యాఖ్యానించాడు. 2008 నవంబర్ ముంబై మారణ హోమం సహా ఎన్నో కేసులలో హఫీజ్ సయీద్ హస్తం ఉన్న సంగతి తెలిసిందే. అతడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది.

  • Loading...

More Telugu News