: ప్రధాని కంటే రాష్ట్రపతే గట్టిగా సందేశం ఇచ్చారు: మోడీ


గుజరాత్ ముఖ్యమంత్రి మరోసారి ప్రధానిని టార్గెట్ చేశారు. ఎర్రకోటపై నుంచి పాక్ కు సరైన సందేశం ఇవ్వలేకపోయారని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పాకిస్థాన్ పై కఠిన వైఖరి ఎందుకు వ్యక్తం చేయలేకపోయారని మోడీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించారు. ఈ ఉదయం గుజరాత్ లోని భుజ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మోడీ మాట్లాడారు.

ప్రధాని కంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో పాక్ కు గట్టిగా సందేశం ఇచ్చారని ప్రశంసించారు. 'అవినీతి గురించి మాట్లాడలేదేమీ?' అని ప్రధానిని నిలదీశారు. 'ప్రధానీ మీరు ఒక కుటుంబాని(గాంధీ)కి అంకితమయ్యారు. మిగతా ప్రజలను మర్చిపోయారు' అని మోడీ ఎద్దేవా చేశారు. అవినీతిపై ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు. సోనియాగాంధీ అల్లుడు వాద్రా భూ అక్రమాలను కూడా ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News