: అమృతసర్ లో పట్టుబడ్డ రూ. 70 కోట్ల విలువైన హెరాయిన్


స్వాతంత్ర్య దినోత్సవం నాడు పంజాబ్ లోని అమృతసర్ లో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడింది. భద్రతలో భాగంగా ఈ ఉదయం పోలీసులు తనిఖీలు జరుపుతుండగా, రంజీత్ అవెన్యూ ప్రాంతంలో హెరాయిన్ను తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు. వారి వద్ద 14 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో 70 కోట్ల రూపాయలుంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News