: ఆ ఇద్దరినీ ప్రశ్నించనున్న ఎన్ఐఏ?


నేపాల్ సరిహద్దులలో అనుమానాస్పద రీతిలో భద్రతా బలగాలకు పట్టుబడిన ఇద్దరు యువకులను జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) ప్రశ్నించనుందని సమాచారం. హైదరాబాద్ చిరునామాతో ఉన్న మొహమ్మద్ అబ్దుల్, సోమాలియా దేశ పౌరుడు ఉమర్ మక్రానీ బీహార్ లోని రాక్సౌల్ సమీపంలో శనివారం భారత్ నుంచి నేపాల్ దేశంలోకి వెళ్లే ప్రయత్నంలో ఉండగా వీరిద్దరినీ భద్రతా బలగాలు పట్టుకున్నాయి. విచారణలోనూ వీరి నుంచి సరైన వివరాలు వెల్లడి కాలేదు.

వీరికి హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో ఏమైనా సంబంధం ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసును స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ వీరిని విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్ఐఏ బృందం రాక్సౌల్ ప్రాంతానికి వెళ్లనుంది. 

  • Loading...

More Telugu News