: టీడీపీ నేత లాల్ జాన్ బాషా దుర్మరణం


టీడీపీ సీనియర్ నాయకుడు లాల్ జాన్ బాషా ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు . హైదరాబాదు నుంచి గుంటూరు వెళుతుండగా నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం డీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం టీడీపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బాషా, 1991లో గుంటూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మరోసారి రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు. ఈయన మరణం టీడీపీ శ్రేణులను షాక్ కు గురిచేసింది.

  • Loading...

More Telugu News