: ఛార్జింగ్‌ లేకున్నా ఎస్‌ఎంఎస్‌ చేయొచ్చు


మనం ఎవరికైనా అర్జంటుగా ఎస్‌ఎంఎస్‌ చేయాలి. అయితే మన ఫోన్‌లో ఛార్జింగ్‌ లేదు... అప్పుడేం చేస్తాం... చార్జర్‌ కోసం వెదుకుతాం. అయితే మీ ఇంట్లో టి.వి. ఉందా... టి.వి. ఉంటే చాలు మీరు ఎంచక్కా చార్జర్‌, చార్జింగ్‌ లేకుండానే ఎస్‌ఎంఎస్‌ పంపించేయొచ్చు. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాలోని మన దేశానికి చెందిన ప్రవాసాంధ్రుడు ఆవిష్కరించాడు.

శ్యామ్‌ గొల్లకోట వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ శాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన బ్యాటరీ, చార్జర్లు అవసరం లేకుండానే మొబైల్‌, కంప్యూటర్‌ ద్వారా ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్స్‌ పంపగలిగే ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొన్నారు. 'యాంబియంట్‌ బ్యాక్‌స్కాటర్‌' అనే ఈ సాంకేతికత మన చుట్టూ ఉన్న టీ.వీ. సిగ్నల్స్‌ ఆధారంగా పనిచేస్తుంది. అంటే కేబుల్‌, డిష్‌ ద్వారా వచ్చే టీ.వీ సిగ్నల్స్‌ కాదు, దూరదర్శన్‌ లాంటి పెద్ద టీవీ కేంద్రాల్లోని అతిపెద్ద యాంటెనా ద్వారా మన ఇంట్లోని టీవీలకు అందే సిగ్నల్న్‌ అన్నమాట. ఈ టీ.వీ సిగ్నల్స్‌నే మొబైల్‌కి కావాల్సిన పవర్‌ ఆధారంగాను, కమ్యూనికేషన్‌ సిగ్నల్స్‌గాను వాడుతున్నారు. కాబట్టి మనం ఉపయోగించే మొబైల్‌, కంప్యూటర్స్‌లో కూడా అదనంగా యాంటెనాను ఏర్పాటు చేస్తారు. మనతో అనుసంధానమయ్యే మొబైల్‌ లేదా కంప్యూటర్‌కీ ఇటువంటి యాంటెనాలే ఉండాలి. బ్యాటరీ, ఛార్జర్స్‌ తప్పనిసరి అయ్యే స్మార్ట్‌ఫోన్‌లోనూ కేవలం ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు ఈ సాంకేతికతను వాడుకోవచ్చని శ్యామ్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News