: ప్రధానికి మోడీ ఓపెన్ చాలెంజ్


గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తాజాగా ప్రధాని మన్మోహన్ సింగ్ ను టార్గెట్ చేశారు. రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగంతో సమానంగా తన ప్రసంగం వింటారని ఆయన చెప్పుకొచ్చారు. తాను గుజరాత్ లో ఏమూల నుంచి మాట్లాడినా.. ప్రధాని ఢిల్లీ ఎర్రకోటలో మాట్లాడిన దానికి దీటుగా ఉంటుందని మోడీ ధీమాగా చెప్పారు. అహ్మదాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ.. 'రేపు ప్రధాని లాల్ ఖిల్లా నుంచి మాట్లాడతారు. అదే సమయంలో నేను గుజరాత్ లోని భుజ్ వద్ద లలన్ కళాశాలలో ప్రసంగిస్తాను. ఎవరి ప్రసంగాన్ని వినడానికి ప్రజలు ఆసక్తి ప్రదర్శిస్తారో చూద్దాం' అంటూ సవాల్ చేశారు. మోడీ రేపు ఉదయం 9 గంటలకు లలన్ కాలేజి నుంచి ప్రసంగించనుండగా.. ప్రధాని మన్మోహన్ ఉదయం 8 గంటలకే రెడ్ ఫోర్ట్ నుంచి జాతినుద్ధేశించి ఉపన్యసించనున్నారు.

  • Loading...

More Telugu News