: రేపటినుంచి ధూళిపాళ్ల దీక్ష.. 19 నుంచి విజయమ్మ కూడా..
గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రేపటి నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. క్విట్ సోనియా నినాదంతో ఈ టీడీపీ ఎమ్మెల్యే తాజా దీక్ష చేపడుతున్నారు. అటు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఈ నెల 19 నుంచి విజయవాడలో ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. రాష్ట్రంపై స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు ఆమె దీక్ష కొనసాగుతుందని తెలుస్తోంది.