: సిటీకి చంద్రబాబు చేసిందేమీ లేదు: జీవన్ రెడ్డి


తెలంగాణ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. నిన్న మీడియా సమావేశంలో బాబు చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి నేడు హైదరాబాదులో స్పందించారు. హైదరాబాదు అభివృద్ధి అంతా తన ఘనతే అని బాబు అవాస్తవాలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వాస్తవానికి హైదరాబాదు నగరం కోసం బాబు చేసిందేమీ లేదని జీవన్ రెడ్డి అన్నారు. దేశంలో ఐటీ రంగం విప్లవాత్మక రీతిలో పుంజుకుందని, ఆ క్రమంలోనే హైదరాబాదులోనూ ఐటీ పరిశ్రమ పురోగమించిందని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేసేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం విభజనకు పూనుకుందన్న బాబు వ్యాఖ్యలను జీవన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం బాబు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News