: స్వాతంత్ర్య వేడుకలకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం ముస్తాబైంది. వేడుకల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసు కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ శకటాలను వేడుకల్లో ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలో పరేడ్ మైదానం, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా హెచ్చరికలు ఉండటంతో పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్ మైదానాన్ని స్వాధీనం చేసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 మంది ఏసీపీలు, 25 మంది ఇన్ స్పెక్టర్లు, 76 మంది ఎస్సైలు, 500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News