: రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటుచేయాలి: టీజీ
రాష్ట్రానికి రాజధాని అంశంపై మంత్రి టీజీ వెంకటేష్ కొత్త తరహా వాదాన్ని తెరపైకి తెచ్చారు. జమ్మూకాశ్మీర్ తరహాలో రెండు లేదా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నారు. అలా ఉంటే తప్పులేదని, అభివృద్ధికి వీలుగా ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాదు, కర్నూలుతో పాటు కోస్తాంధ్రలో మరో రాజధాని కావాలని సీఎంకు తెలిపానన్నారు.