: పేలనున్న డీజిల్ ధరల బాంబు
డీజిల్ నెల నెలా లీటర్ కు 50 పైసలు చొప్పున పెరుగుతూ సామాన్యుడికి ధరల మంట పెడుతోంది. దేశంలో అత్యధిక రవాణా డీజిల్ వాహనాల ద్వారానే జరుగుతోంది. అనేక నిత్యావసరాల రవాణా లారీల ద్వారానే జరుగుతున్నందున ఉత్పత్తుల ధరలు తెలియకుండా క్రమంగా పెరుగుతూ సామాన్యుడి జీవనాన్ని భారం చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో డీజిల్ పై ఏకమొత్తంలో 2 లేదా 3 రూపాయలు పెంచాలని యోచిస్తున్నట్లు పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ బాంబు పేల్చారు. రూపాయి విలువ పడిపోవడం వల్ల చమురు కంపెనీలకు డీజిల్ పై లీటర్ కు 10 రూపాయల నష్టం వస్తోంది. దీంతో ధర పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఒకేసారి ఇలా పెంచడమా.. లేక నెల నెలా 50 పైసలు కాకుండా ఇంకా ఎక్కువ అంటూ రూపాయి వరకు పెంచుకునేలా ఆయిల్ కంపెనీలకు అనుమతి ఇవ్వాలా?.. అని ప్రభుత్వం యోచిస్తోంది.