: హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళతా: వేములవాడ ఎమ్మెల్యే
వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. కోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తామని తెలిపారు. న్యాయం జరిగేవరకూ పోరాడతానన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వులు తనకింకా అందలేదని అవి చూశాకే వివరంగా మాట్లాడతానన్నారు.