: ఇరుప్రాంతాల నేతలకు దిగ్విజయ్ వార్నింగ్


కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ తెలంగాణ, సీమాంధ్ర నేతలను రాష్ట్ర విభజన అంశమై హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆంటోనీ కమిటీ ఈ సాయంత్రం భేటీ అవుతున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతల అభ్యంతరాలను పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర విభజన అంశం సున్నిమైనదని అభిప్రాయపడ్డారు. ఆంటోనీ కమిటీతో భేటీకి సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించామని వెల్లడించారు. కమిటీతో భేటీకి అభ్యంతరాలున్న వాళ్ళు అసెంబ్లీ, పార్లమెంటులో తమ వాదన వినిపించుకోవచ్చని చెప్పారు. ఇక, ప్రభుత్వం తరుపున ప్రత్యేకంగా కమిటీ వేయాల్సిన అవసరం లేదన్నారు.

  • Loading...

More Telugu News