: పాక్ తీరు మారదు!
పాకిస్తాన్ కపట వైఖరి మరోసారి స్పష్టమైంది. నియంత్రణ రేఖ వద్ద మరోసారి కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా, భేఖాతరు చేసిన దాయాది, గత ఐదు రోజుల వ్యవధిలో తొమ్మిదోసారి కాల్పులు జరిపింది. జమ్మూకాశ్మీర్ మెంథార్ సెక్టార్లోని హామీర్పూర్ వద్ద పాక్ సైన్యం.. భారత బలగాలపై గుళ్ళ వర్షం కురిపించాయి. అయితే, ఈ ఘటనలో భారత సైనికులెవరూ గాయపడలేదని ఆర్మీ అధికారులు తెలిపారు.