: జలాంతర్గామి ప్రమాదంలో తెలుగువాడు మృతి


జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురక్షక్ అగ్ని ప్రమాదంలో విశాఖ జిల్లా పెదగంట్యాడకు చెందిన సెయిలర్ రాజేశ్ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఉదయం ముంబై రేవులో నిలిపి ఉంచిన జలంతర్గామిలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది సెయిలర్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకోగా.. కనీసం 18 మంది అందులోనే చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రష్యా తయారీ అయిన సింధురక్షక్ లో హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులు లీక్ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మరోవైపు సంఘటన ప్రాంతాన్ని రక్షణమంత్రి ఆంటోనీ ఈ రోజు సందర్శిస్తారు.

  • Loading...

More Telugu News