: తూర్పుగోదావరిలో విధులు బహిష్కరించిన 45 వేల మంది
సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 45 వేల మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా రెండో రోజు కూడా ఎన్జీవోల సమ్మె కొనసాగుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి తోట నర్సింహం సతీమణి తోట వాణి ఆమరణ దీక్ష నేటితో ఐదో రోజుకు చేరింది. అమలాపురంలో రెవెన్యూ ఉద్యోగుల రిలే దీక్షకు మంత్రి విశ్వరూప్ సంఘీభావం తెలిపారు. కాకినాడలో 350 ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. 250 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. రాజమండ్రిలో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ నుంచి దోబీఘాట్ వరకు 60 మంది సమైక్య జెండాలు చేబూని ఈదుతూ నిరసన తెలిపారు.