: అమ్మపాలు అమృతమే కదా!


పిల్లలకు అమ్మపాలు అమృతంతో సమానం. పుట్టిన వెంటనే అమ్మపాలు తాగిన పిల్లలకు పలురకాలైన అనారోగ్య సమస్యలు దూరంగా వుంటాయి. వారికి అంతటి శక్తి లభిస్తుంది. అమ్మపాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో ఊబకాయం సమస్య కూడా తగ్గుతుందని తాజాగా తేలింది.

ఓకయోమ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అక్కడ 43,367 మంది పాఠశాల విద్యార్ధులపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో ఆరునుండి ఏడు నెలల పాటు అమ్మపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం సమస్య చాలా తక్కువగా కనిపించిందట. తల్లిపాలు కాకుండా డబ్బాపాలు తాగిన పిల్లల్లో మాత్రం ఊబకాయం సమస్య చాలా ఎక్కువగా కనిపించిందని ఈ అధ్యయన బృందం చెబుతోంది. పిల్లలు కంప్యూటర్‌, వీడియో గేమ్‌లు ఆడే సమయాన్ని కూడా వీరి అధ్యయనంలో పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేశారు.

  • Loading...

More Telugu News