: హైదరాబాద్ ను యూటీ చేయాలి: చిరంజీవి
కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర విభజన నేపథ్యంలో నేడు పార్లమెంటు వద్ద సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్నదే తన అభిమతమని చెప్పారు. ఈ దిశగా కృషి చేస్తానన్నారు. నగరంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉందని చిరు చెప్పుకొచ్చారు. సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతోంది అస్తిత్వ పోరాటమన్నారు.