: టీఎన్జీవో నేతలను అరెస్టు చేసిన పోలీసులు
సీమాంధ్ర ఉద్యోగుల పెన్ డౌన్ కు నిరసనగా కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద నిరసనలు చేస్తున్న టీఎన్జీవో నేతలను పోలీసులు అరెస్టు చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్ లను పోలీసులు అరెస్టు చేసి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసిన ఉద్యోగ సంఘాల నేతలను బేషరతుగా విడుదల చేయాలని టీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు.