: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం: బొత్స
సీమాంధ్రలో చెలరేగుతున్న ఆందోళనల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీమాంధ్రలో ఉద్యోగులు సంయమనం పాటించాలని ఆయన వారిని కోరారు. అందరి అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, తాము అందరి ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటున్నామన్న విషయాన్ని సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు గుర్తించాలని ఆయన కోరారు.