: గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను తెలంగాణలో కలపండి: ఎన్సీపీ నేత


మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత ధర్మారావు బాబా ఒక కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 'విదర్భ రాష్ట్రాన్ని ప్రకటించండి, లేదంటే, కనీసం గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే తెలంగాణ రాష్ట్రంలోనైనా కలపండి' అని కోరారు. దీంతో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మరింత వేడెక్కింది. విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తెలంగాణ కంటే ముందు నుంచి ఉందని, దాన్ని కేంద్రం ఇక ఏ మాత్రం ఉపేక్షించరాదని ధర్మారావు అన్నారు. విదర్భ ప్రకటించకుంటే గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ రెండు జిల్లాల వారికి ముంబై కంటే హైదరాబాద్ దగ్గరగా ఉంటుందని, దానివల్ల ప్రజలకు ఉపయోగకరమని ధర్మారావు చెప్పారు.

  • Loading...

More Telugu News