: సీఎంతో భేటీ అయిన బొత్స, ఆనం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్యాహ్నం రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో భేటీ అయ్యారు. గత అర్ధరాత్రి నుంచి సాగుతున్న ఏపీఎన్జీవో నిరవధిక సమ్మె, ఆర్టీసీ సమ్మెపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మెవల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు చూపాలన్న అంశాలపై కూడా మాట్లాడుతున్నట్లు సమాచారం.