: 42 కోతులను హతమార్చారు
హిందువులు పవిత్రంగా భావించే కోతులపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విష ప్రయోగం జరిగింది. సంభల్ ప్రాంతంలోని రహతోల్ మార్గంలో 42 కోతులు విగత జీవులుగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వాటికి విషమిచ్చి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిర్ధారణ కొరకు వాటిని పోస్ట్ మార్టం కోసం పంపించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.