: కేసీఆర్ కు బెదిరింపు లేఖపై కమిషనర్ కు ఫిర్యాదు
పదిరోజుల్లో కాల్చి చంపుతామని బెదిరిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వచ్చిన లేఖపై ఆ పార్టీ నేతలు హైదరాబాదు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖను కూడా కమిషనర్ కు అందించారు. ఎల్ఈటీ ఆంధ్రా నక్సల్స్ పేరుతో గతరాత్రి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆ లేఖపై దర్యాప్తు జరపాలని నేతలు కమిషనర్ ను కోరారు.