: ఆగని పాక్ కవ్వింపులు.. ఎనిమిదవసారి కాల్పులు
జమ్మూకాశ్మీర్ లో సరిహద్దు వద్ద పాకిస్తాన్ సైన్యం దుందుడుకు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిన దాయాది దేశం మరోసారి కాల్పులకు పాల్పడింది. ఈసారి సాంబా జిల్లాలో సరిహద్దు వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ దుశ్చర్యను వెంటనే భారత సైనికులు సమర్థంగా తిప్పికొట్టారు. కాగా, నాలుగు రోజుల వ్యవధిలో పాక్ కాల్పులు జరపడం ఇది ఎనిమిదవసారి.