: వైజాగ్ పోర్టు దగ్గర సముద్రంలో దూకి పరారైన దుండగులు
విశాఖపట్నం పోర్టు దగ్గర కొందరు దుండగులు సముద్రంలోకి దూకి పారిపోయారు. సముద్రంలో ఓ బోటులో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయాణిస్తుండగా నౌకాదళ సిబ్బంది గుర్తించారు. తీర ప్రాంత గస్తీ దళం బోటును సమీపిస్తుండగా వారు సముద్రంలో దూకి పరారయినట్లు తెలుస్తోంది. బోటును స్వాధీనం చేసుకున్న గస్తీ దళం..దుండగుల కోసం గాలింపు చర్యలు చేబట్టింది. మరోవైపు ఈ ఘటనపై మల్కాపురం పోలీసు స్టేషనులో పోలీసులు కేసు నమోదు చేశారు.