: చిన్నారులకు 'పెద్ద' ఆసరా


చిన్న పిల్లలకు అమ్మ, నాన్నలకంటే కూడా అవ్వ, తాతలే ఆత్మీయ నేస్తాలుగా, ఆసరాగా ఉంటారని తాజా అధ్యయనంలో తేలింది. అవ్వ, తాతలు మనుమలు, మనుమరాళ్లకు దగ్గరగా ఉంటే చిన్నవారిని కుంగుబాటు వంటి సమస్యలనుండి దూరం చేస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు మనుమలు, మనుమరాళ్ల ఆటపాటలు, వారి అభ్యున్నతి చూసి ఇటు అవ్వ, తాతలు కూడా చాలా ఆనందంగా, సంతృప్తిగా ఉంటారని ఈ అధ్యయనంలోనే తేలింది.

అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో పసివారికి అవ్వలు, తాతయ్యల తోడుంటే వారు ఎంతో ఆనందంగా, హాయిగా ఉంటారని తేలింది. అలాగే జీవన మలిసంధ్యలో ఒంటరితనాన్ని, నిస్సహాయతను, అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొనే వయోవృద్దులకు మనుమలు, మనుమరాళ్ల ఆటపాటలే మంచి సాంత్వననిస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. ఈ రెండు తరాల మధ్య ఉండే అనుబంధం, ఆప్యాయతలు ఇద్దరికీ చెప్పలేని భద్రతా భావాన్ని ఇస్తాయని, ఇవి పైకి కనిపించని మద్దతు, ఊతం వంటివని పరిశోధకులు చెబుతున్నారు. పెద్దవారి తోడు ఇటు పిల్లలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయట. దీన్నే పరిశోధకులు 'అగోచరమైన మద్దతు' (టాంజిబుల్‌ సపోర్ట్‌)గా పేర్కొంటారు. మనవలకు సలహాలు, సూచనలు ఇవ్వడం, వారితో కలిసి దుకాణాలకు వెళ్లడం, వారికి అవసరమైన వస్తువులను కొనిపెట్టడం, ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉండడం ఇలా దైనందిన జీవితంలో రెండు తరాలవారు ఒకరికొకరు తోడుగా ఉంటూ, చేయూతగా నిలుస్తుంటే ఇది ఇటు పిల్లలకే కాకుండా అటు వయోవృద్ధుల మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News