: ట్వీట్లకు ఓట్లకు మధ్య సంబంధం ఉందట


ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన వాటిలో ఒకటి ట్వీట్‌. ఈ పదం పుట్టిన తర్వాత చాలా తొందరగా అది ఎంచక్కా డిక్షనరీని కూడా ఎక్కేసింది. ఇప్పుడు ఈ ట్వీట్‌ రాజకీయాల్లోకి కూడా ఎంటరైపోయింది. రాజకీయ నాయకుల్లో వారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అన్ని ట్వీట్లు కూడా వచ్చాయని చెబుతున్నారు పరిశోధకులు. ట్వీట్లకు ఓట్లకు మధ్యగల సంబంధాన్ని గురించి కొందరు పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరి అధ్యయనంలో ఈ రెండింటి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్టు తేలిందని చెబుతున్నారు.

ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో రాజకీయ నాయకులకు పడే ఓట్లకు, ట్వీట్లకు మధ్య సంబంధం గతంలో ఊహించినదానికంటే కూడా ఎక్కువగానే ఉందని తేలింది. అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో 2010, 2012లో రిపబ్లికన్‌, డెమోక్రాట్‌ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు శాతం, వారికి వచ్చిన ట్వీట్ల శాతానికి దగ్గరగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే వచ్చిన ట్వీట్లు సదరు అభ్యర్ధికి సానుకూలమా, లేదా ప్రతికూలమా అనే విషయాన్ని ఇక్కడ పట్టించుకోలేదు. ఈ విషయం గురించి ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఫేబియో రోజాస్‌ మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఊహాగాన అంచనాలుగా పరిగణించాలని అంటున్నారు. సామాజిక మీడియా ప్రవర్తన వాస్తవ రాజకీయాలపై చూపుతున్న ప్రభావాన్ని గురించి తెలుసుకునేందుకు రోజాస్‌, అతని సహచరులు కలిసి 53.7 కోట్ల ట్వీట్ల నమూనాలను పరిశీలించారు. అమెరికన్‌ సోషలాజికల్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో అధ్యయనకర్త జోసెఫ్‌ డిగ్రేజియా ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News