: ఆంధ్రప్రదేశ్ రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయింది: డి రాజా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయిందని సీపీఐ ఎంపీ డి.రాజా అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని తేల్చేశారు. నిజాం రాజుకు వ్యతిరేకంగా సీపీఐ అనేక ఉద్యమాలు చేపట్టిందని, తెలంగాణ సాయుధ పోరాటానికి సీపీఐ నాయకత్వం వహించిందని గుర్తుచేశారు. తదనంతర పరిణామాల్లో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో విలీనమైందని అన్నారు. అప్పటి తమ నాయకుడు రావి నారాయణరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచి లోక్ సభకు వచ్చారని రాజా గుర్తు చేశారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క నిర్ణయంతో అరాచకానికి బాటలు పరిచినట్టయిందని అన్నారు.

  • Loading...

More Telugu News