: విభజన మంచిది కాదు: ఎస్పీ ఎంపీ నరేష్ అగర్వాల్
విభజన అనేది ఎప్పటికీ మంచిది కాదని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ అన్నారు. రాజ్యసభలో విభజన ప్రకటనపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు మొగ్గు చూపిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో విభజన ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. వైఖరి చూస్తోంటే భారత్ ను చిన్నచిన్న దేశాలుగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు.