: హరికృష్ణకు వెంకయ్యనాయుడి వకాల్తా


తెలుగుదేశం ఎంపీ నందమూరి హరికృష్ణ రాజ్యసభలో నేడు అనూహ్యంగా బీజేపీ మద్దతు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై చర్చలో ఆయన తాను తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్టగా డిప్యూటీ చైర్మన్ కురియన్ నిరాకరించారు. అంతలో బీజేపీ నేత వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని డిప్యూటీ చైర్మన్ కు సర్ది చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, సభ్యులకు చట్టసభల్లో వారి మాతృభాషల్లో మాట్లాడే హక్కుందని వెంకయ్య అన్నారు. దీంతో, హరికృష్ణ తెలుగులో మాట్లాడేందుకు మార్గం సుగమమైంది.

  • Loading...

More Telugu News