: వర్షం పడుతున్నా 'బోల్ట్' బిగించాడు!
ఓవైపు వర్షం పడుతోంది, అతని కాళ్ళు అప్పటికే గాయాలతో సలుపుతున్నాయి! ఆ వంద మీటర్ల రేసును అందరికంటే అతనే ఆలస్యంగా ఆరంభించాడు. కానీ, ఆ స్ప్రింట్ పూర్తయ్యేసరికి అతడే విజేత. ఇంతటి ప్రతికూలతలను అధిగమించి గెలవడం ఒక్కరికే సాధ్యం.. అతడే ఉసేన్ బోల్ట్. చరిత్ర చెప్పే వాస్తవం ఇది. తాజాగా, మాస్కో అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో ఈ జమైకా చిరుత మరోసారి తడాఖా చూపింది. గతరాత్రి జరిగిన 100మీ. ఫైనల్స్ లో బోల్ట్ 9.77 సెకన్లలో రేసును ముగించి సత్తా చాటాడు. కాగా, ఈ షార్ట్ రన్ లో ప్రపంచ రికార్డు బోల్ట్ పేరిటే ఉంది. బోల్ట్ 2009లో బెర్లిన్ లో జరిగిన పోటీల్లో 9.58 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తి చరిత్ర పుటలకెక్కాడు.