: సమ్మె విరమించండని చెప్పేందుకే ఉపసంఘం: అశోక్ బాబు


సమ్మె విరమించండని చెప్పేందుకే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్టుందని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోతే ముందుగా నష్టపోయేది ఉద్యోగులేనని, అందుకే తాము స్పందించాల్సి వచ్చిందని అన్నారు. ఈ అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. శాంతియుత నిరసనలకు సహకరిస్తేనే ప్రజలు, ఉద్యోగులు ప్రభుత్వాన్ని నమ్ముతారని అన్నారు. సమ్మెకు చాలా సంఘాలు ప్రభుత్వానికి నోటీసిచ్చాయని తెలిపిన అశోక్, కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాన్ని ప్రకటించిందన్నారు. నాలుగు లక్షల మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని ఆశోక్ బాబు తెలిపారు. టీటీడీ ఉద్యోగులు కూడా కలసి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News