: విశాఖలో తీవ్రస్థాయికి చేరిన సమైక్యాంధ్ర ఉద్యమం
సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఊరూవాడా ఏకమై ఉద్యమాన్ని నడిపిస్తుంటే వారికి ఉద్యోగులు మద్దతు పలికారు. ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించనున్నాయి. దీంతో, నేటి అర్థరాత్రి నుంచి అత్యవసర సేవలు తప్ప మిగతా పౌరసేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. కాగా, నేడు విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్ గేటు నుంచి విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు, కేజీహెచ్ లో వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పర్యాటకులకు బొర్రా గుహల ప్రవేశాన్ని టూరిజం శాఖ సిబ్బంది నిలిపేశారు.