: నెహ్రూ వల్లే జమ్మూకాశ్మీర్ పరిస్థితి అలా ఉంది: నరేంద్ర మోడీ
హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేసిన సర్థార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ పరిస్ధితి ఎలా ఉండేదో అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్ నారాయణ గూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్ లో మాట్లాడుతూ వందలాది స్వదేశీ సంస్థానాలను దేశంలో వీలీనం చేయడం వెనుక పటేల్ కృషి ఎంతో ఉందని తెలిపారు. కేవలం జమ్మూ కాశ్మీర్ విలీనాన్ని నెహ్రూ తన పరిథిలోకి తీసుకోవడం వల్లే ఇప్పటికీ ఆ ప్రాంతం అగ్నిగుండంలా ఉందని ఆరోపించారు. గుజరాత్ లో సర్థార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని నెలకొల్పాలన్నదే తన ఆశయమన్నారు.