: కర్ఫ్యూ నేపధ్యంలో ఆగిన అమరనాథ్ యాత్ర
అమరనాథ్ యాత్రకు బ్రేక్ పడింది. జమ్మూ కాశ్మీర్ లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దాంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశముందని భావించిన అధికారులు కొత్త ప్రయాణీకుల బృందాన్ని జమ్మూ నుంచి యాత్రకు అనుమతించలేదు. మరోవైపు అమరనాథ్ యాత్రకు పూంచ్ నుంచి 554 మంది బయల్దేరారు.