: దేశానికి భావి ప్రధాని మోడీయే.. దత్తాత్రేయ జోస్యం
దేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీయేనని బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలంతా మోడీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. నవభారత యువ భేరి సభలో పాల్గొనేందుకు వచ్చిన మోడీని ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా అభిమానులు కలుస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై కుట్రకు దిగితే బీజేపీ తెలంగాణ ఇస్తుందని మోడీ భరోసా ఇచ్చారని ఈ పార్టీ నేతలు తెలిపారు.