: ప్రయాణికుల బోగీలలో వాటర్ ప్యూరిఫయర్లు
ప్రయాణికుల సేవల్లో భాగంగా సాధారణ రైలు బోగీలలో వాటర్ ప్యూరిఫయర్లను(నీటి శుద్ధి పరికరాలు) త్వరలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇప్పటికే రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలోని ప్యాంట్రీ కార్లలో వాటర్ ప్యూరిఫయర్లు ఉన్నాయి. ప్రయాణికులకు దాహం వేస్తే వాటర్ బాటిళ్లు తప్ప మరో మార్గం లేదు. రైలులో పంపుల ద్వారా వచ్చే నీటిలో శుభ్రత ఏమాత్రం ఆశించే పనిలేదు. ఈ నేపథ్యంలో వాటర్ ప్యూరిఫయర్లను అమర్చడం వల్ల ప్రయాణికుల దాహార్తి తీరుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా ముందు కొన్ని రైళ్ల బోగీలలో వాటర్ ప్యూరిఫయర్లను అమర్చనున్నారు. ఇప్పటికే ఇలాంటి వసతులతో ఒక బోగీని జలంధర్ లోని జగ్ధారి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు.