: థార్ ఎడారిలో భారత వైమానిక దళం యుద్ధ విన్యాసాలు


రాజస్థాన్ థార్ ఎడారిలోని ఫోక్రాన్ ప్రాంతంలో భారత వైమానిక దళం రెండు వందల ఎయిర్ క్రాఫ్టులతో భారీగా యుద్ధ విన్యాసాలను  ప్రదర్శించింది. పగలు, రాత్రి ఏ సమయంలోనైనా శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్ధంగా ఉందని..ఇందుకు నేటి ప్రదర్శనే నిదర్శనమని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ ఎ కె బ్రౌన్ తెలిపారు.

శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనిలతో పలువురు ముఖ్యమైన వ్యక్తులు వీక్షించారు. ఈ ప్రదర్శనలో సుఖోయ్-30, జాగ్వార్, ఎంఐజీ యుద్ధ విమానాలతో పాటు మానవ రహిత యుద్ధ విమానాలను వైమానిక దళం ప్రదర్శించింది.

  • Loading...

More Telugu News