: విజయనగరం జిల్లాలో సమైక్యాంధ్ర హోరు
పీసీసీ అధ్యక్షుడు బొత్స సొంత జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. విజయనగరం జిల్లాలో రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా ఆందోళనలు గత 12 రోజులుగా తార స్థాయిలో జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలోని పలు కూడళ్లు నిరసనలు, ఆందోళనలు, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తుతున్నాయి. ఈ రోజు ఉదయం జిల్లా కేంద్రంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతి రాజు సమైక్యాంధ్ర కరపత్రాలు పంచి పెట్టారు. కలెక్టరేట్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేపట్టారు.