: జైలు నుంచే రాజీనామా లేఖను ఫ్యాక్స్ చేసిన జగన్
అక్రమాస్తుల కేసులో రిమాండ్ అనుభవిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకిస్తూ, తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ ఈ మధ్యాహ్నం జైలు అధికారుల సాయంతో ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ కు పంపారు. ఇక వైఎస్ విజయమ్మ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. వీరిద్దరూ స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖలు పంపారని వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.