: సీఎం ఆవేదన సబబే: సురవరం
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. తెలంగాణకు విస్పష్ట మద్దతు ప్రకటించే సీపీఐ కూడా ఇప్పుడు సీఎం సీమాంధ్ర అనుకూల వ్యాఖ్యలు సబబేనంటోంది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, సీఎం వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు అడిగిన తర్వాతే విభజన ప్రకటన చేస్తే బాగుండేదన్నారు. ఇకనైనా ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవాలని హితవు పలికారు.